DETAILS:

Name: Bodasingi Siva

Qualification: M.A Telugu

College: Andhra university

email id: sivachandra960@gmail.com

photo6260464122038693248.jpg

ఓ నిరుద్యోగి ఆవేదన
ఉద్యోగాల వేటలో సుదూర తీరాలకు 
ప్రయాణమైన బాటసారులం మేము
      
ఒకే గదిలో 10 మంది తన్నుకు చాస్తాం
ఆకలి భరించలేక గంజి తాగి బతికేస్తాం
కష్టాల నిప్పులు తొక్కుకుంటూ నిలబడతాం
కోరికలు ఎన్నున్నా కాదని సర్ధుకుపోతాం..
 
ధనమనే ఉరి తాడు బిగుసుకున్నా
చివరి శ్వాస వరకు పోరాడ తాం
వయసు మళ్లీ పోతున్న లక్ష్య సాధనకై కృషి చేస్తాం

అప్పుడే ...
నీకు బుద్ది లేదంటాడొకడు
బ్రతుకు తెరువు కి ఏదోకటి చేయంటడోకడు
ఎన్నేళ్ళు ఈ చడువంటాడొకడు
ఎక్కడికైనా పోయి చావంటాడొకడు

ఓటేసిన పాపానికి
కాటేసిన విషపు నాగులు ఈ నాయకులు
బతుకులు కాల్చేసి డబ్బులడిగె కాటి కాపరులు

అందుకే ...అందుకే 

చదువుకున్న యువత
ఇదేనా నీ నడత

శత్రువులను చీల్చ గల శివాజీ నువ్వే

భయాన్నీ భయపెట్టే భగత్ సింగ్ వి నువ్వే
ఆయుధాలు లేకున్నా గెలిచే ఆజాద్ వి నువ్వే

లే ! యువత పోరాడదాం!

మన హక్కుల కై
మన బతుకుల కై
మన ఆశయాల కై...

నాలో సగం నీవు
నేస్తమా, నా ప్రియతమా, కనిపించని ప్రణయమా...!!
నా కంటిలో కనపడని తీయని కల నీవు,
నా పచ్చని జీవిత వృక్షానికి కనపడని వేఱు నీవు,
నా సిరి నవ్వుల పువ్వుల దండలో దాగిన దారం నీవు,
నా వలపుల స్వరంలో దాగిన రాగం నీవు,
నా మమతల మేఘంలో దాగిన నీటి బిందువు నీవు,
నిన్ను వెన్నంటి ఉన్న నీడను నేను,
నిన్ను వదలని నేలను నేను...!!!

కనిపించక కలవరపెడుతున్నావు,
కలలో నీవు అలరిస్తున్నావు,
నా కవితకు ప్రేరణనిస్తున్నావు,
కమ్మని నా ఊహలో నిలుస్తున్నావు,
తెలియకనే చేరువవుతున్నావు,
మదిలోన చెదరని చిత్రమవుతున్నావు,
పెదవులపై చిరునవ్వువవుతున్నావు,

తనువులో పులకరింతవవుతున్నావు,
మరపురాని మధురిమవవుతున్నావు,
చిలిపి తలపులకు చిరునామావవుతున్నావు... 

చివరి శ్వాసగా మారుతూ చివరి వరకు విడదీయలేని బంధంగా మరావు
శరీరం నాదైతే దానిఆత్మవి అయ్యావు
దానికి కూడా కవితా జ్ఞానాన్ని కలిగించి 
మరింత ప్రేరణ అయ్యావు 
నిన్ను ఏమని పిలవాలో తెలియదు కానీ 
నా చివరి ఊపిరి మాత్రం నీవే అని చెబుతా

అమ్మ ఒడి
తెలుగంటే అమ్మ ఒడి..
తెలుగు వాడి గుండెల సవ్వడి
ఆంధ్రుల జీవనాడి

ప్రాసల యాసల  కలగలుపు
సంస్కృతి సాంప్రదాయాల నిండు వెలుగు

కిల కిల రావల జంట పదాలు
అందచందాల ఆత్మీయ ద్వంద్వ పదాలు
మనోరంజ కమైన పద్య గద్య హోయలు
కవితల కవ్వింతల సోయగాలు
ఆలోచన రేకెత్తించే సామెతలు

అందమైన హరివిల్లు ఈ అక్షరమాల
ఆత్మీయ అక్షరాల హేళ
అలంకారాల తాండవ లీల
ఛందస్సులు సాగే ఎగసే కెరటాలులా
ప్రతి పదమున పసిడి పలుకులే మిలమిల
                 
నన్నయ నుడివిన
శ్రీ కృష్ణ దేవరాయలు పొగిడిన
కవుల కలముల నుండి ఉప్పొంగిన
చిరస్మరణీయం మన తెలుగు భాష
మధుర ఫలాలు ఇచ్చు మహావృక్షం మన భాష