DETAILS:

Name: Kanukurthi Saikiran

Qualification: Degree Bsc.
Occupation: Agriculture Extension Officer
email id:
saikirankanukurthi22@gmail.com

రక్షాబంధన్

"నా మౌనాన్ని జయిస్తావు 
నా ఆవేశాన్ని చూపిస్తావు 
నా హాస్యాన్ని ప్రేరేపిస్తావు
నా గమనాల్ని సరిచేస్తావు  
నా భాదని గుర్తిస్తావు 
ప్రశ్నకి సమాధానమై బదులిస్తావు 
ఆది నుండి అంతిమ వరకు నీ మాటకి బదులు చెప్పే ప్రతి అక్షరం నేనే అవుతా 
రక్త సంబంధాలు ఎన్ని ఉన్న ఆత్మకై పుట్టే బంధానికి మనమే నిదర్శనం కావాలి రక్షాబంధన్ శుభాకాంక్షలు ❤️"

ఓ పరదేసి అమ్మాయి

ఉదయాన్నే లేవడం చాలా బద్దకంగా ఉంటుంది ఈ సూర్యుడొకడు ఎవరో తెగ తరుముతున్నట్టు వెంటనే వచ్చేస్తాడు అంటూ చిరాగ్గా లేచి రెడీ అవ్వడానికి వెళ్ళింది మేఘన 
అంతలో అమ్మ టిఫిన్ రెడీ చేసింది తినేసి కాలేజీకి బయలుదేరింది. ఎవరికైనా కాలేజ్ అంటే ఫ్రెండ్స్ ఆ తరువాతే చదువు అవుతుంది 
ఒకరోజు అనేది అంత తొందరగా గడుస్తుందా అని మన చుట్టూ మన వాళ్ళు ఉంటే తప్ప తెలీదు కదా..! అలాగే మన మేఘనకి కూడా 
అలసటకు నెలవుగా సాయంకాలానికి ఇల్లు చేరింది ఎందుకో తెలీదు ఈ మధ్య నాకు తెలీకుండా ఎవరో నన్ను ఫాలో చేస్తున్నారు అనిపిస్తుంది. అతను ఎవరో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ  పడుకుంది. 
ఉదయం లేచి చూడగానే తన రూమ్ ముందు ఒక బొకె అందులో ఒక లెటర్.. 

 

ప్రియమైన మేఘన ... 
నీ సౌందర్యానికి సాగరం సైతం స్తంభించిపోతుంది 
నీ చిరునవ్వు కొరకు చిగురాకు సైతం వెల్లువిరిసి చూస్తుంది 
నీ పలుకు కోసం పండువెన్నెల పరితపిస్తుంది 
నీతో అడుగు కోసం అవని సైతం అడుగులేస్తుంది
నీ పరిచయం కోసం ప్రతి రేయి పందిరవుతుంది 
మన పరిణయం కోసం ఈ చిన్ని ప్రాణం పరితపిస్తుంది 
నా ప్రేమ స్వీకరించవు.... 

టపీ మని ఉత్తరాన్ని మూసేసింది మేఘన 
అమ్మబాబోయ్ వీడెవడో మరి రైటర్ లా ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని లోపలికి వెళ్ళిపోయింది. 

 

కానీ ఎందుకో తెలీదు ఆ ఉత్తరం తనకి చాలా బాగా నచ్చింది అందుకే తన దగ్గరే పెట్టుకుంది కానీ తనకి ఎప్పటికి దొరకలేదు మేఘన చాలా బాధపడింది అంతగా రాసినవాడు ఒక్కసారైనా నన్ను కలవచ్చు కదా..!


కొన్నాళ్ళకి ఇంట్లో వాళ్ళు సంబంధం చూసి పెళ్లి చేసేసారు అలా పెళ్లి అయిన కొన్ని రోజుల తరువాత ఒక కప్ కాఫీ డే రోజు తిరిగి తన ముందు ఆ కవితని చదివాడు అవినాష్.
మేఘన ఒక్కసారిగా షాక్ అయ్యింది తనకు ఎలా తెలుసు?  అని నాకు తెలీకుండా నా డైరీ చదివాడా?  అని ఉండపట్టలేక నీకెలా?  అని అనబోతుండగా 
నీకు గుర్తుందా మేఘన? 
హ.. నీకెలా తెలుసు అవినాష్..
6 సంవత్సరాల 2 నెలల 18 రోజుల క్రితం నేను నీకు పంపిన ప్రేమ లేక అని చెప్పాడు అవినాష్..
మేఘన ఒక్కసారిగా షాక్ తో ప్రేమగా లేచి గట్టిగా అవినాష్ ని హాగ్ చేసుకుంది..ఎందుకంటే తన బావని తనకి తెలీకుండా అంతలా ప్రేమించాడా అని...

ఒక్కోసారి గతంలో మన చెంత చేరని ప్రేమ తిరిగి బంధమై కలకాలం ఉంటుంది..