DETAILS:

Name: Salahuddin Shams

Pen Name: "VIDARSHI"

Qualification: B.A.LL.B

email id: salahuddinshams2929@gmail.com

WhatsApp Image 2021-09-23 at 3.31.52 PM.jpeg

ఎన్నెన్ని గర్భాలు నీలోన దాగెనో?
ఎన్నెన్ని వొంపులై కృష్ణమ్మ సాగెనో?
ఆకుపచ్చని చీర తీర్థాల జలధార
కాచుకుంటివి తల్లి నీవు మమ్ము కడుపార!

ఎన్నెన్ని వింతలు పుంతలూ తొక్కెనో?
ఎన్నెన్ని కాంతులు భ్రాంతులై పోయెనో?
విశ్రాంతి, విభ్రాంతి,క్రాంతి,సంక్రాంతి తల్లీ
మనసంత మధువు ఓ కల్పవల్లి!

ఎన్నెన్ని పాశాలు నిను కోర జూచెనో?
ఎన్నెన్ని ఆశలు నీ ఉనికి చాటెనో?
కొండలూ,గుట్టలూ,పుట్టలూ,లోయలు
తలపించె చూడు సుందరాంగి సొగసులు!

ఎన్నెన్ని పాపాలు నీ పేర రాసినా
ఎన్నెన్ని నెపాలు నీపై మేము మోపినా
కరుణించావమ్మ నీవు మల్లమల్ల
పచ్చగుండే నీవు ఓ నల్లమల్ల
సల్లగుంచె నీవు ఓ నల్లమల్ల
నడివీధి నర్తించు ఓ నల్లమల్ల
పొడసూపగా నిన్ను ఓ నల్లమల్ల
సిగచుట్టవే నీవు ఓ నల్లమల్ల
పొగచుట్టగా నిన్ను ఓ నల్లమల్ల

విదర్శి

చిరావుయీ చినుకులు చిటపటమను సవ్వడులు
చందనపు ఛాయలు భూమితల్లి మాయలు
ఘూర్ణించిన వాసనలు కస్తూర్ని మించు మన్ననలు
బరువెక్కిన అబ్రములు బసచేసే సంద్రములు
గర్జించిన ఉరుములు బంధించెను కుడుములు
తొవ్వపొంటి పువ్వులు రైతన్న చిరునవ్వులు
భువి అంతా ఆనందాలు భావికివే ఆవాసాలు
ఇష్టమైన పానీయాలు తాగుతారు కాఫీలు
పచ్చపచ్చని బయళ్ళు ఛెంగుమనెడి లేళ్ళు
స్రవంతి పరవళ్ళు విశ్రాంతి లోగిళ్ళు
జలుబనెడి ప్రహారీలు జంకని మురారీలు
కొందరు ప్రపంచపు విహారీలు 'విదర్శి' కవన సఫారీలు!!

 

  విదర్శి
27/06/2019