చరిత్ర లో ఈరోజు!! :: చీరాల - పేరాల ఉద్యమం (1921)

అత్యంత నిస్సహాయ పరిస్థితులలోనే మనలోని ఐఖ్యత భావం , ఎటుంవంటి బేధాలు లేకుండా కలిసి కట్టుగా పోరాడే తత్వం రగులుకుంటుంది. నేడు మన భారతీయులందరు ఎదుర్కొంటున్న పరిస్థితులే అందుకు నిదర్శనం. 100 సంత్సరాలు గతం లోనికి వెళితే , నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, హక్కులు నాటి భారతీయులకు కలలు గానే ఉండేవి. Millenials జనరేషన్ అయిన మనకు స్వాతంత్రోద్యమం , నాటి నేతల పోరాటాలు ,వారి అనుభవాలు కేవలం చిన్నప్పటి పుస్తకాల లో చదువుకున్న కథలు గానే మనకు తెలుసు. సరిగ్గా 100 సంత్సరాల క్రితం జరిగిన అలాంటి ఒక పోరాటం గురించి తెలుసుకుందాం.అది 1921 ,మద్రాసు ప్రెసిడెన్సీ,బ్రిటిష్ ఇండియా. నేటి ఆంధ్ర రాష్ట్రం లోని అప్పటి చీరాల పేరాల అనే రెండు గ్రామాలను కలిపి ఒకే మున్సిపాలిటీ క్రిందకు తేవాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేయటం వలన కట్టవలసిన పన్ను 4000 రూపాయలనుంచి 40000 రూపాయలకు పెంచుతున్నట్టు గా ఉత్తర్వులు ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పటికే పన్ను భారంతో రోజు గడవటం కష్టం అవుతున్న ప్రజలకి ఈ ఆదేశాలు తమలో ఏళ్ళ తడబడి రాగులుతున్న అసహనపు జ్వాలలను తారాస్థాయికి చేర్చాయి . ప్రముఖ స్వాతంత్య్రయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఈ సమస్యను గాంధీ గారి వద్దకు తీసుకొని వెళ్లారు. ఆయన సలహా మేరకు గోపాలకృష్ణయ్య గారు పన్ను సత్యాగ్రహాన్ని మొదలు పెట్టారు. ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వంపై నిరసనగా హర్తాళ్ లు , ధర్నాలు చేపట్టారు.


దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారుమొట్టమొదటి సారిగా మహిళలు ఈ పోరాటం లో ముందుండి నడిపించారు. ఎంతో మంది మహిళలు, సాధారణ ప్రజలు జైలు పాలయ్యారు. అప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గక పోవటం తో తమదైన శైలిలో నిరసనగా ఊరు ఊరంతా ఖాళీ చేసి గ్రామ పొలిమేర్లలో చిన్న చిన్న గుడారాలను ఏర్పాటు చేసుకుని దాదాపు ఒక సంవత్సరం పాటు తమ తమ ఇళ్లకు వెళ్లకుండా బయటనే జీవితం కొనసాగించారు. నేడు ఆ ప్రాంతం చీరాల పట్టణం లో రామనగర్ గా మారింది. అలా ఒక సంవత్సరం పాటు తెలివిగా పన్ను కట్టకుండా ఉండగలిగారు. అసలు గ్రామంలో ఎవ్వరూ లేకపోతే , అప్పటివరకు ఉన్న ప్రజలు అప్పటికప్పుడు కొత్త గ్రామాలను ఏర్పాటు చేసుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం ఎం చేస్తుంది చెప్పండి.!!

ఈ పోరాట శైలికి, మహిళల తెగింపుకు గాంధీ గారు సైతం చీరాల ప్రాంతానికి వచ్చారు. తన మద్దతును తెలిపారు. ఈపాటికే మీరు ఊహించినట్లుగా ఈ ఉద్యమం ఎంతో కాలం నిలువలేదు. ఈ పోరాటానికి ఆర్థిక సహాయార్థం బెజవాడ తదితర ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఉపన్యాసాలు ఇస్తున్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారిని ఖైదు చేసి తిరుచిరాపల్లి లోని సెంట్రల్ జైలుకు తరలించారు. నాయకుడు లేకపోవటం వలన ఉద్యమం నీరుగారిపోయింది. కానీ ప్రజల్లో ఎంతో ధైర్యాన్ని , ఆత్మవిశ్వాసాన్ని , ఐక్యతను తీసుకువచ్చింది. తరువాతి సంవత్సరాల్లో జరిగిన ఎన్నో స్వాతంత్య్ర పోరాటాల్లో చీరాల ప్రజలు పాల్గొన్నారు, దేశ స్వాతంత్య్రానికి తమ వంతు సాయం చేసారు.

నేడు మనం ఫేస్ చేస్తున్న ఈ ప్రాణాంతక నిస్సహాయ సంఘటనలను కూడా పూర్తి ఆత్మస్థైర్యం తో ఎదుర్కొందాం. మనలోని ఐక్యతను చాటుదాం.